logo

మోదీ సభ విజయవంతం చేయాలి

ప్రధాని నరేంద్ర మోదీ జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో పాల్గొని ప్రసంగించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ అన్నారు.

Published : 01 Jul 2022 04:43 IST

సమావేశంలో మాట్లాడుతున్న గోపాలకృష్ణ అగర్వాల్‌, రమేశ్‌, సత్యనారాయణ, విద్యాసాగర్‌, శారద, ప్రదీప్‌

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో పాల్గొని ప్రసంగించే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ అన్నారు. ఖమ్మం నియోజకవర్గలోని పోలింగ్‌ బూత్‌ కమటీలు, శక్తి కేంద్రాల ప్రతినిధులతో గురువారం ఖమ్మంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో బహిరంగ సభకు హాజరు కావాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రధాని మోదీ సందేశాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. సమావేశంలో రమేశ్‌, దొంగల సత్యనారాయణ, గెంటేల విద్యాసాగర్‌, రుద్ర ప్రదీప్‌, శారద పాల్గొన్నారు.

రఘునాథపాలెం, న్యూస్‌టుడే: గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ పిలుపునిచ్చారు.  రేగులచలకలో కిసాన్‌మోర్చా- ఓబీసీ మోర్చా ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం గురువారం రాత్రి జరిగింది. సమావేశంలో గోపాలకృష్ణ మాట్లాడారు. హైదరాబాదులో జరిగే సభకు ప్రజలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జ్‌ కనకంచి రమేశ్‌, ఉప్పల శారద, రుద్రప్రదీప్‌, కిరణ్‌, వీరుగౌడ్‌, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, నరేశ్‌, బాబూచారి, సరస్వతి, రవి పాల్గొన్నారు.

కామేపల్లి, న్యూస్‌టుడే: భాజపా గెలుపే లక్ష్యంగా కష్టపడి పని చేయాలని ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి శ్రీలతా ఉసెండి అన్నారు. రామకృష్ణాపురంలో భాజపా ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు జర్పుల రామారావు అధ్యక్షతన జరిగింది. హైదరాబాద్‌లో జరిగే భాజపా సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజవర్ధన్‌రెడ్డి, గోపికృష్ణ, శ్రీనునాయక్‌, రంగారావు, రామచంద్రయ్య పాల్గొన్నారు.  

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ కుటుంబ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంత్‌ బాజ్‌పాయి అన్నారు. పెద్దతండాలో పాలేరు నియోజకవర్గ పరిధిలోని భాజపా మండల కమిటీల సమావేశం గురువారం నిర్వహించారు. రాష్ట్రంలో తెరాస, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదన్నారు. కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, నాయకులు నరేంద్రరావు, నున్న రవి, శ్రీనివాసరెడ్డి, సంతోష్‌రెడ్డి, కిరణ్‌, కోటయ్య, నాగరాజు, ప్రసాద్‌ పాల్గొన్నారు. రెడ్డిపల్లిలో పద్మశ్రీ వనజీవి ఇంటికి బాజ్‌పాయి వెళ్లి రామయ్య, జానమ్మ దంపతులను సన్మానించారు.

నేలకొండపల్లి, న్యూస్‌టుడే: నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లో లక్ష్మీకాంత్‌ పర్యటించారు. బోదులబండలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంతు ఉపేందర్‌గౌడ్‌ తండ్రి బాలకృష్ణ ఇటీవల మరణించగా పరామర్శించారు. బాలకృష్ణ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని