logo

మంకీ బ్రెడ్‌ పండు.. కోతులకు పండగే..!

ఈ చిత్రంలో చెట్టుకు కాసిన కాయ ప్రత్యేకంగా ఉంది కదూ.. దీనిని ‘మంకీ బ్రెడ్‌ ఫ్రూట్‌’ అంటారు. వీటిని కోతులు ఇష్టపడి తింటాయట. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు ఐదేళ్ల కిందట  మొక్క నాటారు.

Updated : 26 May 2023 06:27 IST

ఈ చిత్రంలో చెట్టుకు కాసిన కాయ ప్రత్యేకంగా ఉంది కదూ.. దీనిని ‘మంకీ బ్రెడ్‌ ఫ్రూట్‌’ అంటారు. వీటిని కోతులు ఇష్టపడి తింటాయట. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు ఐదేళ్ల కిందట  మొక్క నాటారు. ఏడాది నుంచి ఈచెట్టు కాయలు కాస్తోంది. కాయలోపల పందిరి దోస గుజ్జు మాదిరి ఉంటుంది. కాయ తయారయ్యాక సుమారు నెల వరకూ అదే రీతిలో ఉంటుంది. చూసేందుకు బ్రెడ్‌ రంగులో, అదే పరిమాణంలో ఉండటం, కోతులు ష్టపడటంతో దీనికి ‘మంకీ బ్రెడ్‌ ఫ్రూట్‌’ అని పేరు వచ్చింది.

అశ్వారావుపేట, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని