logo

ఐక్యంగా ఉందాం..హక్కులు సాధించుకుందాం

ఐక్యంగా ఉందాం... హక్కుల సాధించుకుందాం అంటూ జ్యుడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాగోలు జ్యోతిబసు, అడుసు వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్‌సీకి వ్యతిరేకంగా జిల్లా కోర్టులోని

Published : 23 Jan 2022 03:11 IST

నిరసనలో న్యాయశాఖ ఉద్యోగులు

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: ఐక్యంగా ఉందాం... హక్కుల సాధించుకుందాం అంటూ జ్యుడీషియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాగోలు జ్యోతిబసు, అడుసు వేణుగోపాల్‌ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్‌సీకి వ్యతిరేకంగా జిల్లా కోర్టులోని న్యాయ శాఖ ఉద్యోగులు శనివారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి, కోర్టు బయట నిరసన తెలియజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలని కోరారు. న్యాయశాఖ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నాయకులు శర్మ, డి.వెంకటేశ్వరరావు, కుద్దూస్‌, హేమంత్‌కుమార్‌, రమణమూర్తి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని