logo

పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే వ్యక్తి ఆత్మహత్య

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దుద్యాలకు చెందిన శ్రీనివాసులు (45) అనే వ్యక్తి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి మృతుడి భార్య పార్వతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసులుకు, అతని కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. శ్రీనివాసులుపై మి

Published : 27 Jan 2022 05:22 IST

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే : కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దుద్యాలకు చెందిన శ్రీనివాసులు (45) అనే వ్యక్తి ఆత్మహత్య వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి మృతుడి భార్య పార్వతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాసులుకు, అతని కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. శ్రీనివాసులుపై మిగిలిన కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని పోలీసులు స్టేషన్‌కు రావాలని పలుమార్లు కబురుపెట్టారు. విసిగిపోయిన శ్రీనివాసులు బుధవారం కొత్తపల్లి చేరుకుని పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పోస్టుమార్టం చేయటానికి అంగీకరించకపోయినా వైద్యుల సూచనలతో సాయంత్రం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ వ్యవసాయంలో నష్టం రావడంతోనే తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారని భార్య పార్వతి ఫిర్యాదు చేశారన్నారు. కాగా పోలీసుల వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె విలేకరుల ఎదుట ఆరోపించడం వివాదానికి దారి తీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని