logo

పొలం విషయంలో ఘర్షణ.. అన్న మృతి

పొలం తగాదాలో అన్నదమ్ముల కుటుంబాలు ఘర్షణకు పాల్పడ్డాయి. అన్న మృతిచెందిన ఘటన దేవనకొండ మండలం పల్లెదొడ్డిలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పల్లెదొడ్డి గ్రామానికి చెందిన శ్రీరాములు(57), లింగన్న ఇద్దరు అన్నదమ్ములు.

Published : 19 May 2022 06:27 IST


 శ్రీరాములు (పాతచిత్రం) 

దేవనకొండ, న్యూస్‌టుడే: పొలం తగాదాలో అన్నదమ్ముల కుటుంబాలు ఘర్షణకు పాల్పడ్డాయి. అన్న మృతిచెందిన ఘటన దేవనకొండ మండలం పల్లెదొడ్డిలో బుధవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పల్లెదొడ్డి గ్రామానికి చెందిన శ్రీరాములు(57), లింగన్న ఇద్దరు అన్నదమ్ములు. శ్రీరాములు ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. లింగన్న వ్యవసాయం చేస్తున్నారు. ఇద్దరికీ పొల్లాలు ఉన్నాయి. తండ్రి చిన్న అంజనేయులు పేరిట ఏడు ఎకరాలు పొలం ఉంది. ఈ పొలం సర్వే చేసేందుకు బుధవారం రెవెన్యూ అధికారులు రావాల్సి ఉంది. సర్వేకు రాకూడదని శ్రీరాములు సోదరుడు లింగన్న కుటుంబం అడ్డుపడటంతో ఇరు కుటుంబాలు ఉదయం వాగ్వాదం, తోపులాటకు దిగాయి. ఈ తోపులాటలో శ్రీరాములు కింద పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు దేవనకొండ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపించారు. శ్రీరాములుకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పత్తికొండకు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతుడి సోదరుడు లింగన్న, మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పత్తికొండ సర్కిల్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని