logo

ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు

ఈనెల 5న ఆదోనికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పర్యటన ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. స్థానిక ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ నుంచి

Published : 03 Jul 2022 02:10 IST

విమానాశ్రయం సిబ్బందితో వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌

ఆదోని విద్య, న్యూస్‌టుడే: ఈనెల 5న ఆదోనికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు పర్యటన ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు. స్థానిక ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్‌ నుంచి పాఠశాలకు వచ్చే రహదారి వరకు ఇరువైపులా బారికేడ్లు కడుతున్నారు. పాఠశాల మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుండడంతో మైదానంలో ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు. పకడ్భందిగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టణంలో ఈ నెల 5న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం సాయంత్రం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక మున్సిపల్‌ ఉన్నత పాఠశాల మైదానంలో జరగనున్న విద్యా కానుకలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతుండడంతో పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలో, మైదానంలో భద్రత ఏర్పాట్లపై ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌తో చర్చించారు.

విమానాశ్రయంలో భద్రత ఏర్పాట్ల పరిశీలన

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ఓర్వకల్లు విమానాశ్రయంలో శనివారం జిల్లా ఎస్సీ సిద్ధార్థ కౌశల్‌ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ విమానాశ్రయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ విమానాశ్రయంలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. విమానాశ్రయంలో ప్రవేశ, నిష్క్రమణల వద్ద బందోబస్తు విధులు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎస్పీ వెంట కర్నూలు గ్రామీణ సీఐ శ్రీనాథరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ పవన్‌కిషోర్‌, ఎస్సై మల్లికార్జున ఉన్నారు.

సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని