logo

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

మండల కేంద్రమైన సి.బెళగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా ఏసీపీ పీరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

Published : 05 Oct 2022 14:54 IST

సి.బెళగల్‌ : మండల కేంద్రమైన సి.బెళగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా ఏసీపీ పీరయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలన్నారు. మట్కా, మద్యం, గుట్కా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈయన నంద్యాల వన్‌టౌన్‌ నుంచి బదిలీపై సి.బెళగల్‌కు పదోన్నతిపై వచ్చారు. స్వగ్రామం కడప జిల్లా శంఖవరం. ఆయన ప్యాపిలి, దేవనకొండ, ఆస్పరి, గూడూరు, చాగలమర్రి, వివిధ పోలీసుస్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా సి.బెళగల్‌ వైకాపా నాయకులు ఆకుల బస్సయ్య, ఎస్‌.ఎం. బాషా, బజారీ, తదితరులు ఎస్సైకు శుభాకాంక్షలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని