logo

మహాదుర్గగా భ్రామరి

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజు సోమవారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి భక్తులకు మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు.

Published : 21 Mar 2023 02:26 IST

నేడు మల్లన్నకు ప్రభోత్సవం

కైలాస వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లు

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజు సోమవారం రాత్రి 7 గంటలకు భ్రమరాంబాదేవి భక్తులకు మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లు కైలాస వాహనంపై ఆశీనులై పూజలందుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల నడుమ గ్రామోత్సవానికి తీసుకొచ్చారు. గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగించారు. దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న, అర్చకులు నారికేళాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఉత్సవం ఎదుట కళాకారులు ప్రదర్శించిన వేషధారణలు, నృత్యాలు, ఢమరుక నాదాలు, కోలాటం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని