logo

ఎమ్మారై ఏమైంది

నంద్యాల జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఎమ్మారై సేవలు ఏడిపిస్తున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ›రూ.7 కోట్లతో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

Updated : 23 Mar 2023 02:55 IST

బాధితులకు ఫిల్మ్‌ ఇవ్వని వైనం

జిల్లా సర్వజన ఆసుపత్రిలో కేంద్రం

నంద్యాల పాత పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో ఎమ్మారై సేవలు ఏడిపిస్తున్నాయి. ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో రూ.7 కోట్లతో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. నిత్యం 20 నుంచి 30 మందికి స్కానింగ్‌ చేస్తున్నారు. పక్షవాతం, వెన్నెముక, నరాల వ్యాధిగ్రస్థులు ఎక్కువ మంది ఉంటున్నారు. బాధితులకు స్కానింగ్‌ చేసి నివేదికలు ఇస్తున్నారే తప్ప ఫిల్మ్‌లు ఇవ్వడం లేదు. దీంతో పేదలు రూ.6 వేల నుంచి రూ.8 వేలు చెల్లించలేక చికిత్స పొందలేక అవస్థలు పడుతున్నారు.

పది రోజులు ఆగాలట

నరాల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి స్కానింగ్‌ కోసం ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.6 వేలు చెల్లించలేక ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. ఎమ్మారై స్కానింగ్‌ చేశారు.. ఫిల్మ్‌లు ఇవ్వడం లేదు. ఫిల్మ్‌లు తీసుకొస్తే సంబంధిత వైద్యచికిత్స అందిస్తామని వైద్యులు చెబుతున్నారు. స్కానింగ్‌ నిర్వాహకులను అడిగితే మరో పది రోజుల్లో ఫిల్మ్‌లొస్తే ఇస్తాం.. అంతవరకు ఏం చేయలేని చెప్పుకొచ్చారు.

గుత్తేదారుడి అలసత్వం

ఎమ్మారై సేవల నిర్వహణను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత సేవలందించాలని నిబంధనలున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రి నుంచి వచ్చేవారికి డబ్బులు తీసుకుని ఎమ్మారై స్కానింగ్‌ చేయొచ్చు. ప్రస్తుతం పనిచేస్తున్న గుత్తేదారుడికి మేలో సమయం ముగుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం. డబ్బులు చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఫిల్మ్‌లు ఇవ్వడం లేదు.. దీనిపై ఆసుపత్రి వైద్యాధికారులు స్పందించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని