logo

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

Published : 25 Mar 2023 01:47 IST

నాయకులకు మిఠాయిలు తినిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లి, న్యూస్‌టుడే: చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. బీసీ నాయకురాలు అనురాధ ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో శుక్రవారం బీసీ సంఘం నాయకులు బీసీ జనార్దన్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. బీసీతో కలిసి కేకు కోసి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తెదేపా హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. నాలుగేళ్లలో ధరల పెరుగుదల మినహా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నవరత్నాల పేరుతో పేదలకు ఇచ్చేది పది శాతమైతే తిరిగి 20 శాతం ధరలు పెంచి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీల విజయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల గెలుపునకు నాంది అన్నారు. నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి వైకాపా నాయకుల్లో ఓటమి భయం పట్టుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు భూషన్న, వీఎన్‌ చౌడయ్య, కేపీ వెంకటేశ్వర్లు, వెంకటరమణ, బాబు, తిమ్మరాజు, మధుసూదన్‌, గుర్రప్ప, కటికవానికుంట శ్రీనివాసులు, తిక్కన్న, గొరిగే నరసింహుడు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని