logo

ఉద్యోగాల కోసం ఉద్యమించాలి

ఉద్యోగాల కోసం యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్‌ జాతీయ కార్యదర్శి ఆర్‌.తిరుమలైరామన్‌, మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.

Published : 02 Apr 2023 02:49 IST

మాట్లాడుతున్న ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లెనిన్‌బాబు

కర్నూలు (వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే: ఉద్యోగాల కోసం యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్‌ జాతీయ కార్యదర్శి ఆర్‌.తిరుమలైరామన్‌, మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కర్నూలులో శనివారం నిర్వహించిన కార్యశాలలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. దేశంలో భాజపా అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కు తదితర సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు పెద్దఎత్తున హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చకపోవటం బాధాకరమన్నారు. ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రాజేంద్రబాబు, లెనిన్‌బాబు మాట్లాడుతూ మే 20 నుంచి 24వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించే ఏఐవైఎఫ్‌ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ, సాంస్కృతిక, యువజన సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్‌కుమార్‌, నాగరాముడు, కత్తి రవి, శ్రీనివాసులు, శ్రీరాములు, కారుమంచి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు