logo

ఫైనాన్స్‌ సంస్థకు మొట్టికాయ

నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్‌ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ మొట్టికాయ వేసింది.

Published : 30 Apr 2024 03:46 IST

 బాధితుడికి పరిహారం చెల్లించాలని ఆదేశం

కర్నూలు న్యాయ విభాగం, న్యూస్‌టుడే : నిబంధనలు పాటించని మణిప్పురం ఫైనాన్స్‌ సంస్థకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ మొట్టికాయ వేసింది. ఎమ్మిగనూరు మండలం కంగనాతికి చెందిన శంఖం రాజగోపాల్‌రెడ్డి రూ.1.87 లక్షల విలువ చేసే నాలుగున్నర తులాల బంగారాన్ని 2018 జూన్‌లో మణిప్పురం ఫైనాన్స్‌ సంస్థలో తనఖా పెట్టి రూ.85 వేలు రుణం తీసుకున్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సదరు ఫైనాన్స్‌ సంస్థ బంగారాన్ని వేలం వేసింది. తీసుకున్న రుణం చెల్లించి బంగారం విడిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మణిప్పురం ఫైనాన్స్‌ సంస్థ అధికారులకు అతను తెలియజేయగా రెండేళ్ల కిందటే వేలం వేసినట్లు చెప్పారు. రుణం పోగా మిగిలిన రూ.14 వేలు చెల్లిస్తున్నామంటూ అతనికి గడువు తీరిన చెక్కు పంపారు. దీంతో ఆయన గతేడాది ఆగస్టులో కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్‌ అధ్యక్షుడు కరణం కిషోర్‌కుమార్‌, సభ్యులు నారాయణరెడ్డి, నజీమాకౌసర్‌లు కేసును పరిశీలించి కర్నూలు వాసికి సంబంధించి అనంతపురం జిల్లా ఎడిషన్‌లో వేలం నోటీసు ప్రకటన ఇవ్వటాన్ని తప్పు పట్టారు. సమాచారం ఇవ్వకుండా వేలం వేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, బాధితుడికి రూ.లక్ష పరిహారంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు