logo

ముగిసిన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌

జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ గురువారంతో ముగిసింది.

Published : 10 May 2024 02:53 IST

87.81 శాతం మంది ఓటు హక్కు వినియోగం

2,879 మంది దూరం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో గత నాలుగు రోజులుగా నిర్వహించిన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ గురువారంతో ముగిసింది. జిల్లాలోని పోలింగ్‌ సిబ్బంది, పోలీసులు, వయో వృద్ధులు, శారీరక దివ్యాంగులు.. ఇలా అందరూ కలిపి 23,612 మంది పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకోగా 20,733 (81.87 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • జిల్లాలో 19,344 మంది పోలింగ్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకోగా 17,661 (91.30 శాతం) మంది ఓటు వేశారు.
  • హోమ్‌ ఓటింగ్‌కు సంబంధించి 85 ఏళ్లకు పైబడి నడవలేనివారు, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వయో వృద్ధులు 582 మంది దరఖాస్తు చేసుకోగా 536 (92.10 శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 415 మందికిగాను 404 (97.35 శాతం) దివ్యాంగ ఓటర్లు ఓటేశారు.
  •  ఇతర జిల్లాలకు చెందిన 3,271 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకోగా 2,132 (65.18 శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జాబితాలో పేర్లు లేకపోవడంతో..

  • కర్నూలు జిల్లాలో ఓటర్లుగా ఉండి నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండుచోట్లా ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఇతర జిల్లాల ఉద్యోగులు కర్నూలు నియోజకవర్గంలో 217 మంది, పాణ్యం నియోజకవర్గంలో 371 మంది ఓటు హక్కు వినియోగానికి దూరమయ్యారు. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో కలిపి 1,139 మంది ఓటు వేయలేదు.
  • జిల్లావాసులై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగుల్లో 19,344 మంది పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకోగా 17,661 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,683 మంది ఓటు వేయలేకపోయారు.
  • 85 ఏళ్లకు పైబడిన వయో వృద్ధుల్లో 46 మంది, 11 మంది దివ్యాంగ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అన్ని కేటగిరీల్లో కలిపి 2,879 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ఓటును సద్వినియోగం చేసుకోలేకపోయారు.
    • ​​​​​​​
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని