logo

చాకిరేవు కాదండి.. పుష్కరఘాట్‌

రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయాల దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుంటారు. నిత్యం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తు రద్దీ ఉంటుంది. ఇక సెలవు రోజులు, పర్వదినాలు, శివరాత్రి మహోత్సవం,

Published : 17 Jan 2022 01:48 IST

భక్తుల అసంతృప్తి

పుష్కరఘాట్‌లో దుస్తులు శుభ్రం చేస్తున్న దృశ్యం

న్యూస్‌టుడే, అలంపూర్‌: రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ ఆలయాల దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుంటారు. నిత్యం ఇక్కడ అధిక సంఖ్యలో భక్తు రద్దీ ఉంటుంది. ఇక సెలవు రోజులు, పర్వదినాలు, శివరాత్రి మహోత్సవం, దేవీ నవరాత్రులు, జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

ఆలయాల సమీపంలో తుంగభద్ర నది ఉండటంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం సంతరించుకుంది. భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానం చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుంటారు. శివ, అయ్యప్ప స్వాములు, జోగులాంబ మాలాధారణ భక్తులు తుంగభద్ర నదిలో స్నానం ఆచరిస్తారు. దేవీ నవరాత్రుల సమయంలో చివరి రోజు స్వామి అమ్మవారిని తెప్పోత్సవంలో తుంగభద్ర నదిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హంస వాహనంలో ప్రదక్షిణలు చేయిస్తారు. పలు సందర్భాల్లో తుంగభద్ర నది పుష్కరఘాట్‌లో నదీహారతులు సైతం అర్చకులు నిర్వహిస్తారు. అలాంటి పవిత్రత ఉన్న నదిలో నిత్యం స్థానికులు దుస్తులు తీసుకొచ్చి శుభ్రం చేస్తున్నారు. దీంతో భక్తులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అపరిశుభ్రంగా దర్శనమిస్తుండటంతో.. : ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేదు. నీరు నిల్వగా ఉంది. పుష్కరఘాట్‌లో ఎగువన దస్తులు ఉతకడంతో దిగువకు సబ్బు నురుగు సైతం వస్తుంది. దీంతో పుష్కరఘాట్‌ చాలా మేరకు అపరిశుభ్రత నెలకొంటుంది. పవిత్రమైన క్షేత్రంలో నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఆలయ నిర్వాహకులు, అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తప్పనిసరిగా దృష్టి పెడతాం : కొత్తగా బాధ్యతలు తీసుకున్నా. అన్ని సమస్యలపై తప్పనిసరిగా దృష్టి పెడతా. ఒక పర్యాయం అన్నీ పరిశీలించి పుష్కరఘాట్‌లో దుస్తులు శుభ్రం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా.

- పురేంధర్‌, అలంపూర్‌ ఆలయాల ఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని