logo

రూ.430 పెరిగిన పల్లీ ధర

వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం వేరుశనగల మేలిమిరకం ధర కాస్త పెరగడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 03 Feb 2023 03:16 IST

మార్కెట్‌యార్డుకు వచ్చిన వేరుశనగలు

వనపర్తి, న్యూస్‌టుడే: వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డులో గురువారం వేరుశనగల మేలిమిరకం ధర కాస్త పెరగడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు, మూడు రోజులుగా తగ్గిన ధరలతో ఆందోళన చెందిన రైతులు గురువారం పలికిన గరిష్ఠ ధరతో ఊరట చెందారు. ఒక్క రోజు తేడాలోనే క్వింటా వద్ద రూ.430 పెరిగి రూ.8820 చొప్పున పలికింది. బుధవారం రూ.8390 పలికింది. గురువారం మార్కెట్‌కు 9066 బస్తాల పల్లీలను రైతులు తరలించారు. వీటిలో కనిష్ఠ రూ.5495, మాదిరి రకానికి చెందినవాటికి రూ.7290 ధర పలికినట్లు మార్కెట్‌ కమిటీ కార్యదర్శి లక్ష్మయ్యగౌడ్‌ తెలిపారు.


మదనాపురంలో క్వింటా రూ.8,059

మదనాపురం : మదనాపురం వ్యవసాయ మార్కెట్‌యార్డులో మేలిమి రకానికి చెందిన వేరుశనగలకు గురువారం గరిష్ఠ ధర రూ.8059 చొప్పున పలికింది. మార్కెట్‌కు 104.70 క్వింటాళ్ల (349 బస్తాల)ను రైతులు తీసుకొచ్చారని మార్కెట్‌ పర్యవేక్షకుడు చంద్రశేఖర్‌ తెలిపారు. కనిష్ఠ రూ.5,726 మాదిరి రకానికి రూ.6,879 చొప్పున రేటు పలికిందని ఆయన పేర్కొన్నారు. యార్డుకు తీసుకొచ్చిన వేరుశనగలను పరిశీలించి ఆయన రైతులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని