logo

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందుకు జాతీయ రహదారులపై పెట్రోలింగ్‌ వాహనాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్పష్టంచేశారు. శనివారం కౌడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు.

Published : 23 Jan 2022 02:59 IST

కౌడిపల్లి ఠాణాలో మాట్లాడుతున్న ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

కౌడిపల్లి, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇందుకు జాతీయ రహదారులపై పెట్రోలింగ్‌ వాహనాలతో నిరంతరం పర్యవేక్షిస్తామని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని స్పష్టంచేశారు. శనివారం కౌడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి దస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని జాతీయ రహదారులపై ఐదు పెట్రోలింగ్‌ వాహనాలు తిరుగుతాయని, ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకొని సాయం చేస్తారని చెప్పారు. ప్రాణనష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల సహకారంతో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో చోరీ చేసిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టంచేశారు. స్థానిక ఠాణాలో కేసులు, ఇతర విషయాలపై ఆరా తీశారు. తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌, సీఐ షేక్‌లాల్‌ మదార్‌, స్థానిక ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని