logo

ఇంధనం.. కాసింత ఉపశమనం.!

ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. దీంతో జిల్లాలో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించనుంది. గత కొద్దినెలలుగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ వస్తోంది. ఈనెల 6న రూ.50 పెంచడంతో

Published : 22 May 2022 02:31 IST

ధరల తగ్గింపుతో...

మెదక్‌, న్యూస్‌టుడే : ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌పై పన్నులు తగ్గించింది. దీంతో జిల్లాలో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించనుంది. గత కొద్దినెలలుగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ వస్తోంది. ఈనెల 6న రూ.50 పెంచడంతో రూ.1,072కు చేరుకుంది. నెలరోజుల వ్యవధిలోనే రెండుసార్లు ధరలను పెంచిన ప్రభుత్వం తాజాగా రాయితీ ఇచ్చింది. కేవలం పీఎం ఉజ్వల్‌ యోజన కింద సిలిండర్లకు వర్తించనుంది. ఒక్కో సిలిండర్‌పై రూ.200 రాయితీ ప్రకటించింది. జిల్లాలో మొత్తం 1,94,580 కనెక్షన్లు ఉండగా.. అందులో ఉజ్వల యోజన కింద 22,157 కనెక్షన్లు ఉన్నాయి. రాయితీతో వినియోగదారులకు రూ.1.93 కోట్ల భారం తగ్గనుంది.

1.30 లక్షలకు పైగా వాహనాలు : పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇది వరకే శతకం దాటి పోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో కేంద్రం లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గించింది. దీంతో పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7 వరకు తగ్గనుంది. జిల్లాలో 85 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. సుంకం తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.75, డీజిల్‌ లీటర్‌ రూ.99.20కు లభించనుంది. జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1,36,443 ఉన్నాయి. వీటిలో ద్విచక్రవాహనాలే అధికం. రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈక్రమంలో కేంద్రం తాజా నిర్ణయంతో వినియోగదారులకు కాస్త ఆర్థిక భారం తగ్గనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని