logo

పిల్లలకు కుటుంబ విలువలు నేర్పాలి

తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు దేవుడితో సమానమని, వారి త్యాగాలతోనే మనమంతా సంతోషంగా ఉంటున్నామని అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ అన్నారు.

Published : 02 Oct 2022 01:26 IST


వయోవృద్ధులను సత్కరిస్తున్న అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌

మెదక్‌, న్యూస్‌టుడే: తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు దేవుడితో సమానమని, వారి త్యాగాలతోనే మనమంతా సంతోషంగా ఉంటున్నామని అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ అన్నారు. శనివారం మెదక్‌లో జిల్లా స్త్రీ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల దినోత్సవాన్ని స్థానిక టీఎన్జీవో భవనంలో నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నేటి తరం పిల్లలకు కుటుంబ విలువలు, తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించడం, వారి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలన్నారు. వృద్ధుల సంక్షేమం, వారి పోషణ, సంరక్షణతో పాటు జీవించే హక్కు, ఆస్తి హక్కు వంటి ఎన్నో హక్కులను ప్రభుత్వం కల్పించిందని, వాటికి భంగం వాటిల్లితే నేరుగా 14567 టోల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. అదనపు పాలనాధికారి వయోవృద్ధులను సత్కరించారు. అంతకుముందు ఆర్డీవో కార్యాలయం నుంచి టీఎన్జీవో భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మజీ, స్వీప్‌ నోడల్‌ అధికారి రాజిరెడ్డి, వయోవృద్ధుల సంఘం జిల్లా ఇన్‌ఛార్జి జగదీశ్‌చంద్ర, జిల్లా అధ్యక్షుడు అరుణ్‌దయరాజ్‌, ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని