logo

కుడికుంట చెరువుకు మహర్దశ

మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు.

Published : 27 Nov 2022 01:47 IST

అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు

న్యూస్‌టుడే, ములుగు:  మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన పలు గ్రామాల ప్రజలు నిత్యం ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా చేస్తే స్థానికులతో ఇతర ప్రాంతాల వారికీ ఆహ్లాదం పంచనుంది. ఈమేరకు ఏఎంసీ ఛైర్మన్‌ జహంగీర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ అంజిరెడ్డి, సర్పంచి మాధవి... ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు సీఎం స్పందించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో  పరిశీలించి ఉన్నతాధికారులకు నెల రోజుల కిందట ప్రతిపాదనలు పంపించారు. ఈక్రమంలో రెండు రోజుల కిందట రూ.3 కోట్లు మంజూరూ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రణాళిక సిద్ధం..

మొత్తం 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ప్రకారం కట్టను వెడల్పు చేయడంతో పాటు ఎత్తు పెంచనున్నారు. కట్టపై సీసీ రహదారి నిర్మించి వీధి దీపాలు ఏర్పాటు చేస్తారు. బతుకమ్మ ఘాట్‌ను నిర్మించనున్నాను. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా అవసరమైన పరికరాలు, యువతకు ఓపెన్‌ జిమ్‌ అందుబాటులోకి తేనున్నారు. చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతారు. సేద తీరేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. సీఎం కేసీఆర్‌ చొరవతో ములుగులో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని.. ప్రస్తుతం చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దనున్నట్లు ఏఎంసీ ఛైర్మన్‌ జహంగీర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ అంజిరెడ్డి, సర్పంచి మాధవి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని