పల్లెకు పచ్చలహారం
పచ్చందాల పెంపునకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వచ్చే ఏడాది నిర్వహించే తొమ్మిదో విడతకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది.
తొమ్మిదో విడతకు సన్నద్ధం
న్యాల్‌కల్ మండలం గంగ్వార్‌లో మట్టి సేకరణలో కూలీలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్: పచ్చందాల పెంపునకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. వచ్చే ఏడాది నిర్వహించే తొమ్మిదో విడతకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. డిసెంబరు 15 నాటికి మట్టి, విత్తనాలు సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
జిల్లాలో 647 పంచాయతీలున్నాయి. ఇందులో 639 గ్రామాల్లో ఉపాధి పథకంలో నర్సరీల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి చుట్టూ కంచె సిద్ధం చేస్తున్నారు. ప్రతి నర్సరీలో పదివేల మొక్కలు నాటించనున్నారు. రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లో నాటేందుకు ఎన్ని అవసరం అవుతాయని గ్రామసభల ద్వారా నమోదు చేసుకుంటున్నారు. అదే విధంగా ఇంటింటికీ పంపిణీ చేసే పూలు, పండ్లవి ఎన్ని కావాలని తెలుసుకుని, పెంచేందుకు ఏపీవో, ఎఫ్‌ఏ, ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో నర్సరీలో రూ.1.68లక్షల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం రూ.10 కోట్లు నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు.
మహిళా సంఘాలకు అప్పగించేలా..
గతంలో ఎన్నడూ లేని విధంగా క్లస్టర్ లెవల్ ఫెడరేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి మండలంలో రెండు వన నర్సరీల బాధ్యతను మహిళ సంఘాలకు అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం వన సేవకుల నియామకానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపడుతోంది. తొలి విడతలో విజయవంతంగా వారు సాధిస్తే భవిష్యత్తులో దశల వారీగా పూర్తిగా వారికే అప్పగించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రత్యామ్నాయంగా..: ప్రతి ఏటా నాణ్యతలేని విత్తనాలు నాటడం వల్ల మొక్కలు మొలకెత్తడం లేదు. దీంతో ఆగస్టు, సెప్టెంబరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సారి దానిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయంగా మరో బెడ్ వేసుకుని పెంచేలా చూడాలని నర్సరీల నిర్వాహకులను జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నర్సరీలో 100 శాతం బతికించేలా వారిదే బాధ్యతని అధికారులు పేర్కొంటున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ అధికారి, సంగారెడ్డి
వన నర్సరీల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తిస్తున్నాం. మట్టి సేకరణ, బ్యాగుల రవాణా, మట్టి నింపడం వంటివి చేస్తున్నాం. మొక్కల పెంపకంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, క్షేత్రసహాయకులదే పూర్తి బాధ్యత. ఉపాధి నిధులు సిద్ధంగా ఉన్నాయి. కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?
-
Ap-top-news News
రుషికొండపై వేంగి బ్లాక్ పూర్తికి టెండర్లు.. అక్కడే సీఎం క్యాంపు కార్యాలయం!
-
World News
US-China: 2025లో అమెరికా, చైనా మధ్య యుద్ధం?
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30/01/2023)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!