logo

సౌరకాంతులకు తరుణోపాయం

సంప్రదాయేతర ఇంధన వనరుల దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సౌర విద్యుత్తు పరికరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి టీఎస్‌రెడ్కో(తెలంగాణ రాష్ట్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) రాయితీ ఇస్తోంది.

Published : 03 Dec 2022 01:23 IST

రాయితీపై యూనిట్లు

ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

భవనంపై ఏర్పాటు చేసిన సౌరపలకలు

సంప్రదాయేతర ఇంధన వనరుల దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా సౌర విద్యుత్తు పరికరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి టీఎస్‌రెడ్కో(తెలంగాణ రాష్ట్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) రాయితీ ఇస్తోంది. తాజాగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి ఉన్న ఉద్యోగులకు బ్యాంకు రుణాలు సైతం ఇప్పించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కథనం

ఎక్కడ సంప్రదించాలంటే..

సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన వారు సౌర విద్యుత్తు యూనిట్‌ను ఏర్పాటుకు ఆసక్తి ఉంటే.. సంగారెడ్డిలోని తెలంగాణ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ది సంస్థ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ముందుకు వస్తే రాయితీపోను మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇప్పించేందుకు టీఎస్‌ రెడ్కో కార్యాచరణ సిద్ధం చేసింది.  

సదుపాయం ఇలా..:

* గృహావసరాల నివాస భవనాలపై సౌర విద్యుత్తు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. ఒక కిలో వాట్‌ సోలార్‌ విద్యుత్తు యూనిట్‌ విలువ రూ.53వేలు. రాయితీ కింద రూ.21,300 కేంద్రం ద్వారా అందుతుంది.

* రెండు కిలో వాట్‌ సామర్థ్యమున్న యూనిట్‌ విలువ రూ.98వేలు. లబ్ధిదారులకు రాయితీ రూపంలో రూ.39వేలు సమకూరుతుంది.

* మూడు, పది కిలోవాట్‌ సామర్థమున్న వాటికీ రాయితీ సదుపాయం ఉంది.


ముందుకొస్తే రుణాలు ఇప్పిస్తాం
-మాణిక్యం, టీఎస్‌రెడ్కో, మేనేజర్‌ (సంగారెడ్డి, వికారాబాద్‌)

సోలార్‌ ఆన్‌గ్రిడ్‌ యూనిట్ల ఏర్పాటుతో విద్యుత్తు ఆదాకు మార్గం సుగమం అవుతుంది. తరగని ఇంధన వనరుల వినియోగంపై అందరూ దృష్టి సారించాలి. ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సోలార్‌ విద్యుత్తు యూనిట్లకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమను సంప్రదిస్తే బ్యాంకు అధికారులతో మాట్లాడి రుణాలు ఇప్పించాలని నిర్ణయించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని