logo

మాతాశిశు సంరక్షణే లక్ష్యం

మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ప్రతి గర్భిణి వివరాలు తొలి త్రైమాసికంలోనే నమోదు చేయాలని పాలనాధికారి రాజర్షి షా ఆదేశించారు.

Published : 05 Feb 2023 02:04 IST

కలెక్టరేట్‌ పనులను పరిశీలిస్తున్న పాలనాధికారి రాజర్షి షా, అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌ తదితరులు

మెదక్‌, న్యూస్‌టుడే: మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా ప్రతి గర్భిణి వివరాలు తొలి త్రైమాసికంలోనే నమోదు చేయాలని పాలనాధికారి రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఆయా శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐసీడీఎస్‌, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేసి గర్భిణుల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు 76 శాతం ఉందని, ఈ నెలాఖరు వరకు 80 శాతానికి పెంచాలని సూచించారు. ఆశా, ఏఎన్‌ఎం, ఏడబ్ల్యూఐలకు వేచి ఉండే గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల 1, 15 తేదీల్లో వీహెచ్‌ఎన్‌డీ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్‌సీడీ లక్ష్యాలను చేరుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాకు 23 పల్లెదవాఖానాలు మంజూరయ్యాయని, వాటికి తహసీల్దార్లతో కలిసి వైద్యాధికారులు 250 గజాల స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు.

పకడ్బందీగా కంటి వెలుగు : కంటివెలుగు శిబిరాలను అవసరం మేర ఉదయం గంట ముందు, సాయంత్రం గంట ఆలస్యంగా నిర్వహించాలని పాలనాధికారి సూచించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందించి ట్యాబ్‌లో చిత్రాన్ని అప్‌లోడ్‌ చేయాలన్నారు. పకడ్బందీగా కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు. క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయని చోట ఈనెల 15 లోగా స్థలాలు గుర్తించాలని ఎంపీడీవో, తహసీల్దార్లను ఆదేశించారు. అనంతరం ఆయన ఔరంగాబాద్‌ శివారులోని కొత్త సమీకృత కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరితగతిన రహదారులు, ప్రహరీ నిర్మించాలని అధికారులకు సూచించారు. అదనపు పాలనాధికారి ప్రతిమాసింగ్‌, జిల్లా వైద్యాధికారి చందునాయక్‌, జడ్పీ సీఈవో శైలేష్‌, డీపీవో సాయిబాబా, డీసీహెచ్‌ పి.చంద్రశేఖర్‌, జిల్లా అధికారులు విజయలక్ష్మి, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌, జయరాజ్‌, విజయశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని