logo

ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి..

లోక కల్యాణానికి శ్రమించే వారు నిత్యం ప్రజల మనసుల్లో బతికే ఉంటారని భగవద్గీత ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, గీతా ప్రచారకర్త గంగాధరశాస్త్రి అన్నారు.

Published : 29 Mar 2023 02:12 IST

భగవద్గీత ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గంగాధరశాస్త్రి

సమావేశంలో మాట్లాడుతున్న గంగాధరశాస్త్రి

రామాయంపేట, న్యూస్‌టుడే: లోక కల్యాణానికి శ్రమించే వారు నిత్యం ప్రజల మనసుల్లో బతికే ఉంటారని భగవద్గీత ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, గీతా ప్రచారకర్త గంగాధరశాస్త్రి అన్నారు. వీహెచ్‌పీ మెదక్‌ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యాన రామాయంపేట పట్టణంలో హనుమాన్‌ చాలీసా సహస్ర పారాయణ యజ్ఞ కార్యక్రమం కనులవిందుగా మంగళవారం రాత్రి కొనసాగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని లోకానికి చాటామని, అది భగవద్గీతతో సాధ్యమైందన్నారు. అది సార్వజనీన గ్రంథమని ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలన్నారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, బిచ్కుంద సంస్థాన్‌ మఠం సద్గురు సోమలింగ శివాచార్య, వీహెచ్‌పీ కేంద్రీయ మార్గదర్శక మండలి నారాయణఖేడ్‌ సంగ్రామ్‌ మహరాజ్‌ స్వామి, రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి, శ్రీపీఠం మధుసూదనానంద, కృష్ణానందస్వామి, పుర ఛైర్మన్‌ జితేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సమావేశ ప్రాంగణంలో పూలతో ఏర్పాటు చేసిన హనుమాన్‌ విగ్రహం అందరినీ ఆకర్షించింది. కార్యక్రమానికి 4 వేల మందికి పైగా భక్తులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని