పదేళ్ల నిరీక్షణకు తెర
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు ఆమోదముద్ర వేశారు.
త్వరలో ఆదర్శ ఉపాధ్యాయుల బదిలీలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇందుకు ఆమోదముద్ర వేశారు. జూన్ మొదటి వారంలో బదిలీల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కథనం.
262 మందికి అవకాశం
జిల్లాలో 10 ఆదర్శ పాఠశాలలున్నాయి. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన జరుగుతుంది. అన్ని సౌకర్యాలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వీటిని ప్రారంభించింది. ఉన్నత పాఠశాలలకు టీజీటీలు, ఇంటర్మీడియట్‌కు పీజీటీఆర్‌టీలు బోధన చేస్తున్నారు. నియామక సమయంలో చాలా మంది ఉపాధ్యాయులకు ఇతర జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ పాఠశాలలు ప్రారంభమైన నాటి నుంచి బదిలీలు నిర్వహించలేదు. వీటిలో 262 మంది బోధన, బోధనేతర సిబ్బంది పని చేస్తున్నారు. బదిలీల ప్రక్రియ చేపట్టాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభించనుంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
ఆదర్శ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ఈ ప్రక్రియ ప్రారంభిస్తాం. మరో పది రోజుల్లో పూర్తి స్థాయి సమాచారం వచ్చే అవకాశం ఉంది.
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్
-
Hyderabad: సెల్ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్