logo

నిండు మనసుతో ఆశీర్వదించండి

ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.

Published : 28 Mar 2024 01:29 IST

మాట్లాడుతున్న హరీశ్‌రావు, చిత్రంలో ఫారూఖ్‌ హుస్సేన్‌, వెంకట్రామిరెడ్డి

సిద్దిపేట, న్యూస్‌టుడే: ఈ ప్రాంత ప్రజాసమస్యలపై లోతైన అవగాహన ఉందని, ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించాలని మెదక్‌ పార్లమెంట్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కోరారు. సిద్దిపేటలో పార్టీ శ్రేణుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ మట్టి బిడ్డగా మెదిలానని.. ఉద్యోగ జీవితంలో మచ్చలేని మనిషిగా పేరు తెచ్చుకున్నానని తెలిపారు. సిద్దిపేట నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. అనంతరం సిద్దిపేట ప్రైవేటు స్కూల్‌ అసోసియేషన్స్‌, ముస్లిం పెద్దలు, న్యాయవాదుల సంఘం, జిల్లా పద్మశాలి సమాజం, ఐఎంఏ ప్రతినిధులు కలిసి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, నాయకులు రాధాకృష్ణశర్మ, రాజనర్సు, సాయిరాం, రవీందర్‌రెడ్డి, నాగిరెడ్డి, మాణిక్యరెడ్డి తదితరులు ఉన్నారు.

రేపు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో ఈనెల 29న భారాస సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. స్థానిక కొండమల్లయ్య గార్డెన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 3 వేల మందితో నిర్వహిస్తామన్నారు. మహిళా, విద్యార్థి, యువత, ఇతర అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని