logo

ఎన్డీయేతోనే సుపరిపాలన: తమిళిసై

దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళిసై అన్నారు.

Published : 05 May 2024 01:41 IST

మాట్లాడుతున్న మాజీ గవర్నర్‌ తమిళిసై

మెదక్‌, న్యూస్‌టుడే: దేశం అభివృద్ధి చెందాలన్న.. సురక్షితంగా ఉండాలన్నా... సుపరిపాలన కోసం, పేదరికాన్ని నిర్మూలించాలంటే నరేంద్ర మోదీ ప్రధాని కావాలని రాష్ట్ర మాజీ గవర్నర్‌ తమిళిసై అన్నారు. భాజపా విశేష్‌ సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా శనివారం రాత్రి స్థానిక మాయా గార్డెన్స్‌లో మేధావుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భాజపా తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను మార్చదని స్పష్టం చేశారు. రఘునందన్‌రావును ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, విశేష్‌ సంపర్క్‌ అభియాన్‌ రాష్ట్ర కన్వీనర్‌ అమర్‌నాథ్‌, లోక్‌సభ కన్వీనర్‌ సంగమేశ్వర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పరణిత, మెదక్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుభాష్‌గౌడ్‌, నేతలు విజయ్‌కుమార్‌, ఎంఎల్‌ఎన్‌రెడ్డి, మధు, నాయిని ప్రసాద్‌, జగదీశ్‌చంద్ర పాల్గొన్నారు.

పేదలకు అండగా మోదీ పథకాలు

శివ్వంపేట, వెల్దుర్తి: భారాస, కాంగ్రెస్‌ దోచుకునే పార్టీలని, భాజపా ప్రభుత్వం పేదలకు పథకాలు అందించిందని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావు అన్నారు. శివ్వంపేటలో శనివారం రాత్రి రోడ్‌షో, కార్నర్‌ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. నాయకులు మురళీ యాదవ్‌, రాజేందర్‌, రఘువీరారెడ్డి, రమణారావు, బచ్చేష్‌ యాదవ్‌, మండల అధ్యక్షుడు పెద్దపులి రవి ఉన్నారు.  వెల్దుర్తిలోనూ ప్రచారం కొనసాగింది.

మనోహరాబాద్‌: అయిదు నెలలైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీలు నెరవేర్చడం లేదని మెదక్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. మండలంలోని కాళ్లకల్‌, మండల కేంద్రం మనోహరాబాద్‌, కూచారంలో శనివారం రోడ్డు షోలు నిర్వహించి కార్నర్‌ సమావేశంలో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఉగ్రవాదులు రెచ్చిపోయారన్నారు. మోదీ పాలనలో ఎక్కడా అలాంటి ఘటనలు జరగలేదన్నారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అసైన్డ్‌ భూములు కబ్జా చేశారన్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా కేసీఆర్‌ ఎప్పుడైనా ఈ ప్రాంతానికి వచ్చారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో నత్తి మల్లేశ్‌, చంద్రశేఖర్‌, జక్కిడి నరేందర్‌రెడ్డి, సాయిబాబా, నరేందర్‌చారి, నందన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని