logo

వరి కొయ్యలకు నిప్పు.. పొగతో ఉక్కిరిబిక్కిరై రైతు మృతి

తాను కౌలు చేస్తున్న పొలంలో వరికొయ్యలకు నిప్పు పెట్టి ఆ పొగ ధాటికి ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక రైతు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో శనివారం సాయంత్రం

Published : 05 Dec 2021 03:19 IST

ఘటనాస్థలంలో రైతు మృతదేహం

ముకుందాపురం(మునగాల గ్రామీణం), న్యూస్‌టుడే: తాను కౌలు చేస్తున్న పొలంలో వరికొయ్యలకు నిప్పు పెట్టి ఆ పొగ ధాటికి ఉక్కిరిబిక్కిరై ఊపిరాడక రైతు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానిక రైతులు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుండు కనకయ్య (58) కౌలు రైతు. ఆయన అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద తొమ్మిది ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. పంట కోసిన అనంతరం యాసంగి సీజనుకు భూమిని సిద్ధం చేసే క్రమంలో శనివారం వరికొయ్యలకు నిప్పు పెట్టాడు. పొలంలో మరో వైపుకు వెళ్లి అక్కడ కొయ్యలను కాలుస్తున్న ఒక్కసారిగా పొగ ఆయన్ను కమ్మేసింది. పొగతో ఊపిరాడక అక్కడికక్కడే ఆయన మృతిచెందాడు. గంట తర్వాత పొలానికి వచ్చిన కుమారుడు నరేశ్‌ తన తండ్రి కింద పడిపోయి ఉండడాన్ని గమనించారు. శ్వాస పరిశీలించగా అప్పటికే మరణించినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందిచడంతో ఘటనాస్థలాన్ని సందర్శించారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని