logo

శ్రీస్వామి సన్నిధిలో వసతుల లేమి

లక్ష్మీనృసింహుని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి మట్టపల్లికి వచ్చే భక్తులు క్షేత్రంలో బస చేసేందుకు వసతులు లేక అవస్థలు పపడుతున్నారు. శుక్ర, శనివారాలలో తీర్థజనులు వేయి మందికి పైగా ఇక్కడికి

Published : 07 Dec 2021 03:59 IST

క్షేత్రంలో బస చేసేందుకు భక్తుల అవస్థలు

మట్టపల్లిలో అసంపూర్తిగా భక్తుల వసతి గదుల సముదాయం

మఠంపల్లి, హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: లక్ష్మీనృసింహుని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి మట్టపల్లికి వచ్చే భక్తులు క్షేత్రంలో బస చేసేందుకు వసతులు లేక అవస్థలు పపడుతున్నారు. శుక్ర, శనివారాలలో తీర్థజనులు వేయి మందికి పైగా ఇక్కడికి వస్తుంటారు. వీరంతా ప్రస్తుతం దేవాలయ పరిసరాల్లో నిద్రిస్తున్నారు. వెంటతెచ్చుకున్న సంచులు భద్రపరచుకునే సదుపాయాలు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వసతులు లేక దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నా పాలకవర్గం, దేవాదాయశాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి. 2010లో స్థానిక అన్నదాన సత్రకమిటీలు భక్తులకోసం గదుల సముదాయం, సామాగ్రి భద్రపరచుకునేందుకు లాకర్ల సదుపాయం కల్పించేలా భవనాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. స్లాబ్‌ దశలో వివిధ కారణాలతో ఈ పనులు నిలిచిపోయాయి. అప్పటి నుంచి పట్టించుకునేవారు లేక ఈ భవనం అసంపూర్తిగా ఉంది. కనీస వసతుల కల్పనపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆలయ ఛైర్మన్‌ చెన్నూరు మట్టపల్లిరావు మాట్లాడుతూ భవ్య సిమెంట్స్‌ యాజమాన్యం అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేయాలని తంగెడలోని భవ్య సిమెంట్స్‌ యాజమాన్యాన్ని కోరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని