logo

బొమ్మలతో మురిపించి.. అక్షరాలతో మెరిపించి..

చేతి వేళ్లతో అందమైన బొమ్మలు వేస్తూ వివిధ పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు చిన్నారులు. పిల్లలు తమ ఆలోచనలకు పదును పెడుతూ రకరకాల బొమ్మలు వేస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. రంగు రంగుల పెన్సిళ్లు,

Published : 17 Jan 2022 06:13 IST

● జాతీయస్థాయిలో ప్రతిభ చాటిన చిన్నారులు

విద్యార్థులు గీసిన చిత్రాలు

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: చేతి వేళ్లతో అందమైన బొమ్మలు వేస్తూ వివిధ పోటీల్లో పాల్గొంటూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు చిన్నారులు. పిల్లలు తమ ఆలోచనలకు పదును పెడుతూ రకరకాల బొమ్మలు వేస్తూ నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటున్నారు. రంగు రంగుల పెన్సిళ్లు, పెయింటింగ్‌లతో అందంగా చిత్రాలు గీస్తూ ప్రతిభను చాటుతున్నారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన కళాభారతి ఛైల్డ్‌ ఆర్ట్స్‌ ఇనిస్టిట్యూట్‌ పాఠశాల విద్యార్థులకు జాతీయస్థాయిలో చిత్రలేఖనం, హ్యాడ్‌రైటింగ్‌ పోటీలు ఇటీవల నిర్వహించింది. పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలోనే చిత్రాలు గీసి వాటిని పోస్టు ద్వారా పంపించారు. ఈ పోటీల్లో నల్గొండలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు మోక్షశ్రీ(1వ తరగతి), కె.కృష్ణతేజ(5వ) శివాంజలి(7వ) మహేజబీన్‌(9వ)లు చిత్రలేఖనంలో, సాయి విగ్నేష్‌(3వ), సీహెచ్‌.సోమార్చన(5వ), కె.అక్షయ(7వ) తరగతి విద్యార్థులు చేతిరాతలో ప్రతిభను చాటి కళాభారతి అవార్డుకు ఎంపికయ్యారు.


అవార్డు రావడం ఆనందంగా ఉంది

-మాహిజబీన్‌, 9వ తరగతి

చిత్రాలు గీయడం, పెయింటింగ్‌ వేయడంలో దిట్ట. తనకు జాతీయస్థాయిలో కళాభారతి అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉంది. చదువుతో పాటు వివిధ కళల్లో నైపుణ్యాన్ని పెంచుకున్న. పాఠశాల స్థాయిలో నిర్వహించిన మెహెందీ డిజైన్‌ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచాను. ఇప్పటికే ఎన్నో బహుమతులు అందుకున్నా.


మైక్రో ఆర్ట్‌పై మక్కువ

-ఎం.శ్రీహిత, 3వ తరగతి

చిత్రలేఖనం మీద ఆసక్తితో బొమ్మలు గీయడం, రంగులు వేయడం వంటి చిత్రాలు గీస్తున్న. తాను మైక్రో ఆర్ట్‌ మీద ఎక్కువ ఆసక్తి పెంచుకున్నా. ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో మూడవ తరగతి విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచా. బొమ్మలు వేయడమే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషలో అక్షరాలు అందంగా రాస్తా. ఇంగ్లీష్‌లో ప్రింటింగ్‌ లెటర్‌లు, లుసిడా హ్యాడ్‌ రైటింగ్‌, కర్స్యూ హ్యాడ్‌ రైటింగ్‌ అవలీలలుగా రాస్తాను. తనకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. తన నైపుణ్యాన్ని మెరుగుపరచుకుంటూ మరిన్ని అవార్డులు సాధిస్తా.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని