logo

పల్లె నుంచి పట్నానికి పరుగులు

మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకున్న సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు సోమవారం సొంతూళ్ల నుంచి రాజధాని హైదరాబాద్‌ బాట పట్టారు.

Published : 18 Jan 2022 02:40 IST

చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై బారులు తీరిన కారులు

చౌటుప్పల్‌ గ్రామీణం, చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: మూడు రోజుల పాటు వైభవంగా జరుపుకున్న సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు సోమవారం సొంతూళ్ల నుంచి రాజధాని హైదరాబాద్‌ బాట పట్టారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. బండెనక బండి వరుస పెట్టి భాగ్య నగరి వైపు వేగంగా దూసుకెళ్లాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద హైదరాబాద్‌ మార్గంలోనే తొమ్మిది టోల్‌ చెల్లింపు కేంద్రాలను తెరిచారు. ఫాస్టాగ్‌ విధానం అమలుతో నిమిషాల వ్యవధిలోనే వాహనాలు టోల్‌ప్లాజా దాటుతున్నాయి. సంక్రాంతికి పండక్కి తొలిసారి టోల్‌ప్లాజా వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన బాధలు తప్పాయి. ఫాస్టాగ్‌ విధానంతో ట్రాఫిక్‌ తిప్పలు తప్పాయని టోల్‌ప్లాజా నిర్వాహకులు తెలిపారు. టోల్‌ప్లాజాను సోమవారం రాత్రి డీసీపీ కె.నారాయణరెడ్డి సందర్శించారు. పండుగ సందర్భంగా అదనంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాల వివరాలను జీఎమ్మార్‌ సంస్థ మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌రెడ్డి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.శ్రీనివాస్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని