logo

పోలీసుల అదుపులో రెండు బియ్యం లారీలు

జిల్లా నుంచి అక్రమంగా రేషన్‌ బియ్యం తలుతున్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు డయల్‌ 100  ద్వారా ఇచ్చిన సమచారం మేరకు హుజూర్‌నగర్‌ పోలీసులు స్పందించారు. మిర్యాలగూడ నుంచి కాకినాడకు తరులుతున్న రెండు లారీలను

Published : 19 Jan 2022 04:17 IST

హుజూర్‌నగర్‌: పోలీసుల అదుపులో ఉన్న బియ్యం లోడు లారీ

హుజూర్‌నగర్‌, హుజూర్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: జిల్లా నుంచి అక్రమంగా రేషన్‌ బియ్యం తలుతున్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు డయల్‌ 100  ద్వారా ఇచ్చిన సమచారం మేరకు హుజూర్‌నగర్‌ పోలీసులు స్పందించారు. మిర్యాలగూడ నుంచి కాకినాడకు తరులుతున్న రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం అర్థరాత్రి తర్వాత హుజూర్‌నగర్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 100 నంబర్‌కు కాల్‌ చేసి అక్రమంగా ప్రజాపంపిణీ బియ్యం తరలిస్తున్నారంటూ సమాచారం అందించారు. వెంటనే ప్రత్యేక బృందం తనిఖీలు నిర్వహించి రెండు బియ్యం లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కోక్క లారీలో 250 క్వింటాళ్ల చొప్పున 500 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిర్యాలగూడకు చెందిన వ్యాపారి రవీందర్‌ నాయక్‌కు చెందిన ఆర్‌ఎస్‌ ట్రేడర్స్‌ ద్వారా రవితేజ ట్రేడింగ్‌ (పత్తిపాడు, కాకినాడ)కు పంపుతున్నట్లు పత్రాలు లభించాయి. ఇటీవల మంచిర్యాలలో పీడీఎస్‌ బియ్యం వేలం నిర్వహించారు. వాటిలో కొంతమేర సదరు వ్యాపారి దక్కించుకున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించిర పత్రాలు సైతం పోలీసులు లారీల్లో లభించాయి. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఫలితం వస్తే కానీ మరిన్ని వివరాలు వెల్లడించలేమని ఎస్‌ఐ వెంకటరెడ్డి తెలిపారు. సరైన పత్రాలు లేకపోవడంతో ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. వ్యాపారి రవీందర్‌ నాయక్‌ ఇక్కడికి చేరుకున్నా.. మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విచారణలో తేలే అంశాలను బట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని