logo

కలహాలు కప్పిపుచ్చుకొనేందుకే కాంగ్రెస్‌ విమర్శలు: గుత్తా

కాంగ్రెస్‌ పార్టీలో కలహాలు కప్పిపుచ్చుకొనేందుకే నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు

Published : 21 Jan 2022 02:35 IST

మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి, పక్కన బండా నరేందర్‌రెడ్డి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీలో కలహాలు కప్పిపుచ్చుకొనేందుకే నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదులో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిల సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకోవడం ఆ పార్టీ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్‌ పాలనపై కాంగ్రెస్‌ నాయకుల విమర్శలు హేయమైనవి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని నిలదీయడంలేదన్నారు. కాంగ్రెస్‌ పాలనలో జరగని అభివృద్ధి ఉమ్మడి జిల్లాలో తెరాస హయాంలో ఏడేళ్లలో జరిగిందన్నారు. రూ.11వేల కోట్లతో ఆర్‌అండ్‌బీ పనులు, రూ.1,500 కోట్లతో కొత్త లిఫ్టుల ఏర్పాటుతో పాటు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, యాదాద్రి అభివృద్ధి ప్రతిపక్ష నాయకులకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ నాయకులు పగటి కలలు కంటున్నారని తెలిపారు. బండి సంజయ్‌ నియోజకవర్గంలోనే ఆయనపై వ్యతిరేకత వచ్చిందని ఆయన ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి, దయాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని