logo

ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దే: ఉత్తమ్‌

రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని, తెరాస ప్రభుత్వం కర్షకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌....

Published : 22 Jan 2022 03:42 IST


హుజూర్‌నగర్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డిని సన్మానిస్తున్న ఉత్తమ్‌, ఇతర నాయకులు

కోదాడ, హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని, తెరాస ప్రభుత్వం కర్షకులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గీతారెడ్డి ఆరోపించారు. శుక్రవారం కోదాడ, హుజూర్‌నగర్‌ పట్టణాల్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్షా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సమర్థపాలన అందించేది కేవలం కాంగ్రెస్‌ పార్టీనేని అభిప్రాయపడ్డారు కోదాడ, హుజూర్‌నగర్‌లలో కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులకు నిరసనగా ఫిబ్రవరి రెండో వారంలో జైలు భరో కార్యక్రమం చేపట్టినట్లు ఉత్తమ్‌ ప్రకటించారు. నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో 2 లక్షల సభ్యత్వాలు చేశామని ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు. లక్ష్యం చేరుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. లక్ష్యం చేరుకున్న బూత్‌ ఎన్‌రోలర్లను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. నల్గొండ, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు శంకర్‌ నాయక్‌, చెవిటి వెంకన్న యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని