logo

నల్గొండలో అదృశ్యం.. హైదరాబాద్‌లో ఆత్మహత్యాయత్నం

నల్గొండలో అదృశ్యమైన వ్యక్తి.. వనస్థలిపురంలోని ఓ హోటల్‌కు చేరుకున్నాడు. పురుగుల మందు తాగి.. ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంసభ్యులకు ఫోన్‌లో చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. క్షణాల్లో స్పందించి అతన్ని కాపాడిన ఘటన సోమవారం వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Published : 24 May 2022 03:51 IST

3 నిమిషాల్లో చేరుకొని ఆస్పత్రిలో చేర్పించి కాపాడిన పోలీసులు


ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికృష్ణ

వనస్థలిపురం, న్యూస్‌టుడే: నల్గొండలో అదృశ్యమైన వ్యక్తి.. వనస్థలిపురంలోని ఓ హోటల్‌కు చేరుకున్నాడు. పురుగుల మందు తాగి.. ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంసభ్యులకు ఫోన్‌లో చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. క్షణాల్లో స్పందించి అతన్ని కాపాడిన ఘటన సోమవారం వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. నల్గొండలోని సాయినగర్‌ కాలనీలో ఉండే పాకాల సాయికృష్ణ (28) డిగ్రీ పూర్తి చేసి స్థానికంగా వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతనికి ముగ్గురు సోదరులు. మూడు రోజుల క్రితం నల్గొండలో ఇంటి నుంచి బయటకు వచ్చిన సాయికృష్ణ.. ఆదివారం రాత్రి వనస్థలిపురం అభ్యుదయనగర్‌లోని ఓయో హోటల్‌కు వచ్చి గది అద్దెకు తీసుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, పురుగుల మందు తాగానని తెలిపాడు. కుటుంబసభ్యులు వెంటనే వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించారు. మూడు నిమిషాల్లోనే పెట్రోలింగ్‌ వాహనంలో హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, హోంగార్డు రాజు హోటల్‌కు వెళ్లి.. సాయికృష్ణను గుర్తించి హుటాహుటిన అతన్ని సమీపంలోని మెడిసిస్‌ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను బాధితుడు చెప్పలేదని పోలీసులు తెలిపారు. పోలీసు సిబ్బందిని ఏసీసీ పురుషోత్తంరెడ్డి, సీఐ సత్యనారాయణ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని