logo

ఆధార్‌ కేంద్రం లేక అవస్థలు

కొండమల్లేపల్లి తహసీల్‌ కార్యాలయం ఆవరణలో గల ఆధార్‌ నమోదు కేంద్రంలో పది రోజుల క్రితం దొంగలు పడి కంప్యూటర్‌ ఎత్తుకెళ్లారు. దీంతో నాటి నుంచి కేంద్రం మూతపడింది.

Published : 24 May 2022 03:51 IST


మూతపడిన కేంద్రం

కొండమల్లేపల్లి తహసీల్‌ కార్యాలయం ఆవరణలో గల ఆధార్‌ నమోదు కేంద్రంలో పది రోజుల క్రితం దొంగలు పడి కంప్యూటర్‌ ఎత్తుకెళ్లారు. దీంతో నాటి నుంచి కేంద్రం మూతపడింది. వేరే కంప్యూటర్‌లో సాంకేతికతను అప్‌లోడ్‌ చేయాలని సంబంధిత అధికారులకు విన్నవించుకున్నామని కేంద్రం నిర్వాహకులు తెలిపారు. అధికారుల అలసత్వంతో పది రోజులైనప్పటికీ సాంకేతికను అప్‌లోడ్‌ చేయకపోవడంతో ఆధార్‌ కేంద్రంలో అవసరమున్న వారు అవస్థలు పడుతున్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద లబ్ధి పొందుతున్న రైతులు ఈకేవైసీ చేయించుకోవడం కోసం కేంద్రానికి వచ్చి ఖాళీగా వెళ్తున్నారు. తప్పని పరిస్థితిలో పలువురు ఏడు కి.మీ.దూరంలో ఉన్న దేవరకొండకు వెళ్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వెంటనే ఆధార్‌ కేంద్రాన్ని తెరిపించాలని ప్రజలు కోరుతున్నారు.

- కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని