logo

దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలకం: ఎస్పీ

కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ సెల్‌ ఎస్పీ దేవేందర్‌ అన్నారు. సూర్యాపేటలో పోలీసు అధికారులకు సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు.

Published : 24 May 2022 04:10 IST


సూర్యాపేటలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, చిత్రంలో రాష్ట్ర కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ సెల్‌ ఎస్పీ దేవేందర్‌

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర కౌంటర్‌ ఇంటిలిజెన్స్‌ సెల్‌ ఎస్పీ దేవేందర్‌ అన్నారు. సూర్యాపేటలో పోలీసు అధికారులకు సోమవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారం, రవాణా వివరాలను ఒకేచోట నిక్షిప్తం చేసి డీవోపీఏఎంఎస్‌(డ్రగ్‌ అఫెండర్స్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం) అప్లికేషన్‌ను రాష్ట్ర పోలీసు శాఖ రూపొందించిందన్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న వారి కేసుల వివరాలను నిక్షిప్తం చేసి సైకాప్స్‌ (సైబర్‌ క్రైం అనాలసిస్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం) అనే అప్లికేషన్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ అప్లికేషన్లను ఉపయోగించి నేరస్థుల నేర చరిత్రలను తెలుసుకోవచ్చన్నారు. డీఎస్పీలు మోహన్‌కుమార్‌, రెహమాన్‌, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, పోలీసు సైబర్‌ వారియర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సూర్యాపేట గ్రామీణం: పిల్లలమర్రి దేవాలయాలను ఇంటిలిజెన్స్‌ ఐజీ తిరుగ్యాన సంబంధన్‌ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఎరకేశ్వర, నామేశ్వరాలయాలతో పాటు లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయాల కమిటీ ఛైర్మన్‌ వల్లాల సైదులుయాదవ్‌, మాజీ సర్పంచి సోమగాని లింగస్వామి, రాపర్తి సైదులు, మహేష్‌ పాల్గొన్నారు.

సూర్యాపేట నేరవిభాగం: వృద్ధ తల్లిదండ్రుల సరరక్షణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడారు. పోలీసు కుటుంబాల సంక్షేమానికి పాటుపడతామన్నారు. ఆర్ముడ్‌ రిజ్వర్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ కోటిరెడ్డి, సూర్యాపేట పట్టణ ఠాణాలో విధులు నిర్వర్తిస్తున్న దావుల వీరప్రసాద్‌ ఇటీవల మృతిచెందారు. బాధిత కుటుంబాలకు పోలీసు సంక్షేమ నిధి పథకం ద్వారా చెక్కులను సూర్యాపేటలో అందజేశారు. పోలీసు సంక్షేమ శాఖ ఆర్‌ఐ గోవిందరావు, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షుడు రామచందర్‌రావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని