logo

పట్టుబడిన గంజాయి దహనం

పోలీసుల ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో పట్టుబడిన నిషేధిత గంజాయిని పోలీసులు దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో పకడ్బందీ తనిఖీల్లో పట్టుబడి....

Published : 17 Aug 2022 04:48 IST


ఉండ్రుగొండ గుట్టల్లో నిషేధిత గంజాయిని కాల్చి వేయిస్తున్న జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

చివ్వెంల, న్యూస్‌టుడే: పోలీసుల ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో పట్టుబడిన నిషేధిత గంజాయిని పోలీసులు దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో పకడ్బందీ తనిఖీల్లో పట్టుబడి 48 కేసుల్లో సీజ్‌ చేసిన సుమారు 12 క్వింటాల 50 కిలోల గంజాయిని ఒక దగ్గరకు చేర్చి చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టలలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మంగళవారం తగులబెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, డ్రగ్స్‌ డిస్పోజల్‌ కమిటీ ఛైర్మన్‌ రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో న్యాయస్థానంలో కమిటీ నిర్ణయం ప్రకారం న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేయగా డ్రగ్స్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో గంజాయిని కాల్చి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. గంజాయితో సమాజానికి, యువతకు భంగం వాటిల్లుతుందన్నారు. డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఇన్‌స్పెక్టర్లు ఆంజనేయులు, నాగార్జున, రాజేష్‌, శివశంకర్‌, ఎస్సై పి.విష్ణుమూర్తి సిబ్బంది పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని