logo

మరింత కుంగిన ఎడమ కాల్వ లైనింగ్‌

హాలియా పరిధిలోని సాగర్‌ ఎడమ కాల్వ 16.800 కి.మీ.వద్ద కాల్వ లైనింగ్‌ మరింత కుంగింది. లైనింగ్‌ దెబ్బతిన్న ప్రాంతాన్ని ఎన్నెస్పీ ఈఈ లక్ష్మణ్‌, డీఈ సంపత్‌ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Updated : 04 Oct 2022 06:31 IST

సాగర్‌ ఎడమ కాల్వ 16.800 కి.మీ.వద్ద కుంగిన లైనింగ్‌

హాలియా, న్యూస్‌టుడే: హాలియా పరిధిలోని సాగర్‌ ఎడమ కాల్వ 16.800 కి.మీ.వద్ద కాల్వ లైనింగ్‌ మరింత కుంగింది. లైనింగ్‌ దెబ్బతిన్న ప్రాంతాన్ని ఎన్నెస్పీ ఈఈ లక్ష్మణ్‌, డీఈ సంపత్‌ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల వర్షాలతో వాటర్‌ లెవల్‌ ప్రాంతంలో లైనింగ్‌ 60 మీటర్ల మేర కుంగిందని, ఈ ప్రాంతంలో కట్ట బలంగా ఉన్నందున ప్రస్తుతం నీటి విడుదల వల్ల ప్రమాదమేమీ లేదన్నారు. ‘కట్టకు గండి పడనుందని, మరలా నీటిని నిలుపుదల చేస్తార’నే వదంతులను రైతులు నమ్మవద్దని కోరారు. లైనింగ్‌ కుంగిన చోట వేసవిలో పూర్తిస్థాయి మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు.

సాగర్‌ 8 గేట్ల ద్వారా నీటి విడుదల

నాగార్జునసాగర్‌: సాగర్‌ జలాశయం నుంచి 8 గేట్ల ద్వారా ఎన్నెస్పీ అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు శ్రీశైలం నుంచి 1,09,386 క్యూసెక్కుల వరద నీరు రాగా.. సాగర్‌ డ్యాం 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64,552 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 589.70 (గరిష్ఠం 590.00) అడుగుల వద్ద ఉంది. సాగర్‌ కుడి, ఎడమ, వరద కాల్వలు, ప్రధాన విద్యుత్కేంద్రం, ఎస్సెల్బీసీ, నీటిఆవిరితో కలిపి ఎగువ నుంచి వచ్చిన నీరు వచ్చినట్లుగా విడుదలవుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని