logo

పదేళ్లుగా.. పైపైకి

ఈ  రోజుల్లో విద్యుత్తు లేకుండా ఏ రంగం పురోగతి సాధించే పరిస్థితి లేదు. ప్రతి రంగంలోనూ ఎలక్ట్రికల్‌ వస్తువులు ఎక్కువయ్యాయి. రోజురోజుకూ వాడకం ఎక్కువైపోతోంది.

Updated : 07 Feb 2023 06:32 IST

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న విద్యుత్తు వినియోగం
కోదాడ న్యూస్‌టుడే

ఈ  రోజుల్లో విద్యుత్తు లేకుండా ఏ రంగం పురోగతి సాధించే పరిస్థితి లేదు. ప్రతి రంగంలోనూ ఎలక్ట్రికల్‌ వస్తువులు ఎక్కువయ్యాయి. రోజురోజుకూ వాడకం ఎక్కువైపోతోంది. వ్యవసాయ రంగంలో, గృహ అవసరాల్లో, పరిశ్రమల్లో, ఇతర రంగాల్లో విద్యుత్తు లేనిదే ముందుకు కదలని పరిస్థితి. రానున్నది వేసవికాలం కావడంతో విద్యుత్తు డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

2014 నుంచి పెరుగుతూనే..

రాష్ట్రంలో ఏటా విద్యుత్తు వాడకం పెరుగుతూనే ఉంది. 2014 నుంచి ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ మోటార్లు 40 శాతం పెరిగాయి. వ్యవసాయ కనెక్షన్లు పెరగడంతో పాటు 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో వ్యవసాయ రంగంలో వినియోగం అమాంతం పెరిగింది. గృహాల్లో విద్యుత్తు పరికరాల వాడకం 45శాతం పెరిగింది. పదేళ్ల క్రితం టీవీలు, ఫ్రిజ్‌లు, ఏసీల వినియోగం లేదు. ఇప్పుడు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ ఉంటోంది. దీంతో సామాన్యుల ఇళ్లలోనూ విద్యుత్తు ఎక్కువగా వాడుతున్నారు. ప్రతి పట్టణంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. పరిశ్రమల్లో విద్యుత్తు వాడకం పెరిగిపోవడంతో డిమాండ్‌ సైతం ఎక్కువైంది. రాబోయే పదేళ్లలో ఎక్కువగా విద్యుత్తు వినియోగించే రంగాల్లో పరిశ్రమలు ముందుంటాయని, వ్యవసాయ రంగాన్ని అధిగమించే అవకాశాలు ఉన్నాయని విద్యుత్తు అధికారి ఒకరు తెలిపారు.


రాబోయే రోజుల్లో డిమాండ్‌..
-పాల్‌రాజు, ఎస్‌ఈ, సూర్యాపేట జిల్లా

విద్యుత్తు మీద ఆధారపడి ఎన్నో రంగాలు పని చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో వినియోగం మరింత పెరగనుంది. జిల్లాలో వ్యవసాయ రంగానికి ఎక్కువగా విద్యుత్తు అవసరం అవుతోంది. తర్వాత స్థానంలో పరిశ్రమలు ఉన్నాయి. డిమాండ్‌కు తగినట్లు సరఫరా చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని