logo

ఖాళీ.. కష్టంగా మారి

విద్యుత్తు శాఖలో ఖాళీలు కంగారెత్తిస్తున్నాయి.ఏళ్లుగా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Published : 09 Feb 2023 03:22 IST

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే

స్తంభంపై మరమ్మతులు చేస్తున్న సిబ్బంది

విద్యుత్తు శాఖలో ఖాళీలు కంగారెత్తిస్తున్నాయి.ఏళ్లుగా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న విద్యుత్తు సర్వీసులకు అనుగణంగా కొత్త పోస్టులు మంజూరు చేయడంతో పాటు, ఉద్యోగ విరమణ పొందుతున్న వారి స్థానాలను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపడంతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఖాళీ పోస్టుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పని భారం పడుతోంది. దీంతో వినియోగదారులకు సక్రమంగా సేవలు అందకుండా పోతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 770 పోస్టుల ఖాళీ..

విద్యుత్తు సంస్థలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన జూనియర్‌ లైన్‌మెన్లు, లైన్‌మెన్ల పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్తు సమస్యలు, సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు అన్నీ తామై చూసుకోవాల్సిన సిబ్బంది సంఖ్య రోజురోజుకు తగ్గిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి  గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లాలో 870 మంజూరు పోస్టులు ఉండగా.. 220 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా ఏఈ-2, ఏఏవో-3, ఏడీఈ-3, జూనియర్‌ అసిస్టెంట్లు-25, అసిస్టెంటు లైన్‌మెన్లు- 83, జూనియర్‌ లైన్‌మెన్‌- 76, టైపిస్టు-4 ఖాళీగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 1357 పోస్టులు మంజూరు చేయగా.. 357 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఏఈ, ఏడీఈలు ఒక్కరు చొప్పున, సహాయ గణాంకాధికారులు 35, టైపిస్టులు-12, లైన్‌మెన్‌-13, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌-138, జూనియర్‌ లైన్‌మెన్‌-119 ఖాళీగా కనిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో 884 మంజూరు పోస్టులు ఉండగా.. 193 పోస్టులు ఖాళీలున్నాయి. వీటిల్లో జూనియర్‌ లైన్‌మెన్‌-27, అసిస్టెంటు లైన్‌మెన్‌- 119, జూనియర్‌ అసిస్టెంట్లు-18 చొప్పున ఖాళీలున్నాయి.  


ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది

చంద్రమోహన్‌, ఎస్‌ఈ నల్గొండ జిల్లా

క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవలే ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మిగతా పోస్టుల వివరాలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నాం. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సిబ్బంది అధికారుల సమన్వయంతో పని చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని