logo

రికవరీలో నిర్లక్ష్యం వహించొద్దు: కలెక్టర్‌

స్త్రీ నిధి రుణాల రికవరీ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్‌లో సెర్ప్‌కు సంబంధించిన డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, స్త్రీనిధి సిబ్బంది, బ్యాంకు లింకేజీ, పీఎంఎఫ్‌, ఎంఈ, ఫార్మ్‌, నాన్‌ఫార్మ్‌, ఐబీ, బిల్డింగ్‌, డీపీఆర్‌ తదితర అంశాలపై సమీక్షించారు.

Published : 22 Mar 2023 04:05 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి

నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: స్త్రీ నిధి రుణాల రికవరీ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం నల్గొండ కలెక్టరేట్‌లో సెర్ప్‌కు సంబంధించిన డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, స్త్రీనిధి సిబ్బంది, బ్యాంకు లింకేజీ, పీఎంఎఫ్‌, ఎంఈ, ఫార్మ్‌, నాన్‌ఫార్మ్‌, ఐబీ, బిల్డింగ్‌, డీపీఆర్‌ తదితర అంశాలపై సమీక్షించారు. స్త్రీనిధి గ్రూప్‌ సభ్యులతో సమావేశాలు నిర్వహించి, సభ్యులు ఎంత రుణం కట్టాలన్న విషయాలు తెలుసుకుని పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు డీఆర్‌డీవోకు పంపించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో సీసీలు, ఏపీఎంలు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. అడవిదేవులపల్లికి ప్రత్యక్షంగా వెళ్లి అక్కడి పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని డీఆర్‌డీవోకు తెలిపారు. యూనిట్‌ వారిగా ఎన్‌పీఏ, బ్యాంకుల వారిగా ఎన్‌పీఏ వివరాలను ధ్రువీకరించుకుని డీఆర్‌డీవోకు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఈనెల 23న రికవరీలో వెనకబడి ఉన్న మండలాలు, గ్రామాలకు చెందిన సిబ్బందిని జిల్లా కేంద్రానికి పిలిపించాలని డీఆర్‌డీవోకు తెలిపారు. ఏప్రిల్‌ 1న సమీక్ష ఉంటుందని, ఈలోగా పనితీరు మెరుగుపరచుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. డీఆర్‌డీవో కాళిందిని, అధికారులు పాల్గొన్నారు.  
నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే:  పదో తరగతి పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున ప్రత్యేక తరగతులలో ఉపాధ్యాయులు బోధించిన అంశాలు శ్రద్ధగా విని మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి విద్యార్థినులకు సూచించారు. మంగళవారం సాయంత్రం నల్గొండలోని ఆర్‌పీ రోడ్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పది ప్రత్యేక తరగతులను తనిఖీ చేశారు. ఎంఈవో నర్సింహా, డీసీఈబీ సెక్రటరీ కొమ్ము శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని