logo

చిరుత కళేబరం లభ్యం

నల్గొండ సమీపంలోని మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డు ప్రాంతం చెట్ల పొదల్లో చిరుత కళేబరం కనిపించింది. ఇది పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని తెలుస్తోంది.

Updated : 30 Mar 2023 04:33 IST

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: నల్గొండ సమీపంలోని మున్సిపాలిటీ డంపింగ్‌ యార్డు ప్రాంతం చెట్ల పొదల్లో చిరుత కళేబరం కనిపించింది. ఇది పది రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని తెలుస్తోంది. స్థానికులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నల్గొండ, తిప్పర్తి పరిసరాల్లోని ఖాజీరామారం, కేశరాజుపల్లి గ్రామాల్లో 10 రోజుల క్రితం చిరుత ఆనవాళ్లు ఉన్నట్లు గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. అడవి పందులు పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు విషపు గుళికలు పెట్టారు. అవి తిన్న రెండు పందులు చనిపోయాయి. చనిపోయిన పందిని చిరుత తిన్నట్లు అటవీ అధికారులు భావిస్తున్నారు. దీంతో పులి చనిపోయిందని డీఎఫ్‌వో రాంబాబు తెలిపారు. మరో చిరుత కూడా ఉండవచ్చని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత రాచకొండ ప్రాంతం నుంచి నల్గొండకు వచ్చి ఉండవచ్చని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు. చనిపోయిన చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం హైదరాబాద్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని