logo

సాఫ్ట్‌గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!

గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్‌బాల్‌ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు.

Published : 28 Mar 2024 05:04 IST

జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న విద్యార్థులు

సాఫ్ట్‌బాల్‌ సాధన చేస్తున్న విద్యార్థులు

ఆలేరు, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్‌ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్‌బాల్‌ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ నైపుణ్యాన్ని చాటుతున్నారు.


స్పోర్ట్స్‌ కోటాలో ఉందని..
- ఎం.తరుణ్‌, ఎంటెక్‌, ఇబ్రహీంపూర్‌, తుర్కపల్లి మండలం  

ఎంటెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. సాఫ్ట్‌బాల్‌ స్పోర్ట్స్‌ కోటాలో ఉండటంతో ఆరో తరగతి నుంచే శ్రమిస్తున్నాను. తూప్రాన్‌, డిచ్‌పల్లి, ఆర్మూర్‌, బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాను. జాతీయస్థాయి పోటీల్లోనూ పాల్గొని సత్తాచాటాను.


జాతీయస్థాయిలో ప్రతిభ
- గోప సంతోష్‌రెడ్డి, డిగ్రీ, దత్తాయిపల్లి, తుర్కపల్లి

డిగ్రీ పూర్తి చేశాను. పదో తరగతి నుంచి సాఫ్ట్‌బాల్‌ క్రీడపై ఆసక్తిని పెంచుకున్నాను. ఇప్పటికీ మూడుసార్లు జాతీయ, 13 సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 2017లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాను. మహారాష్ట్రలో రెండు సార్లు జరిగిన నేషనల్‌ మీట్‌లో పాల్గొన్నాను. అంతర్జాతీయ క్రీడాకారుడిగా ఎదగాలన్నదే నా లక్ష్యం. స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగం సాధిస్తాను.


ఆసక్తి కనబరుస్తున్నారు..
- ర్యాకల వీరేశం, సాఫ్ట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, యాదాద్రి జిల్లా    

అంతర్జాతీయంగా పేరొందిన క్రీడల్లో సాఫ్ట్‌బాల్‌ కూడా ఒకటి. అమెరికాలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. మన దేశంలోనూ గతంలో ఎక్కువ మంది ఉండేవారు. రెండున్నర దశాబ్దాలుగా ఎవరూ కూడా అంతగా దృష్టిని సారించలేదు. గత ఆరేడేళ్లుగా మళ్లీ గమనంలోకి వచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా సాఫ్ట్‌బాల్‌ క్రీడపై ఆసక్తిని కనబర్చుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని