logo

రూ.రెండు వేల కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

జిల్లాలో ఎన్‌డీసీసీబీ సేవల ద్వారా రూ.2వేల కోట్ల టర్నోవర్‌ సాధించాలన్నది లక్ష్యమని సీఈవో శంకరబాబు తెలిపారు. ఆత్మకూరు శాఖను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు

Published : 04 Dec 2022 02:34 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే

శంకరబాబు, సీఈవో ఎన్‌డీసీసీబీ

జిల్లాలో ఎన్‌డీసీసీబీ సేవల ద్వారా రూ.2వేల కోట్ల టర్నోవర్‌ సాధించాలన్నది లక్ష్యమని సీఈవో శంకరబాబు తెలిపారు. ఆత్మకూరు శాఖను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. బ్యాంకు పరిధిలో అందే సేవలు, లక్ష్యాలు, రైతులకు అండగా చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే...

రూ.1668 కోట్లు అధిగమించాం

ఈ ఏడాది రూ.2వేల కోట్ల టర్నోవర్‌ సాధించాలన్నది లక్ష్యం. ఇప్పటికే రూ.1668 కోట్లు అధిగమించాం. మార్చి ఆఖరులోపు లక్ష్యాలు సాధిస్తాం. బ్యాంకుల ద్వారా బంగారంపై రుణాలు రూ.200 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా- రైతులకు రూ. 1250 కోట్లు అందజేశాం. డిపాజిట్ల లక్ష్యం రూ. 528 కోట్లు ఉండగా.. ఇప్పటి వరకు రూ. 418 కోట్లు సాధించాం. రికవరీల విషయంలో 90 శాతం సాధించాం.

సేవల స్థాయి విస్తృతం

బ్యాంకు పరిధిలో సేవల స్థాయి గత ఏడాదిన్నరతో పోల్చితే.. రూ. 600 కోట్లకు పెరిగింది. 30 శాతంపైనే వృద్ధి సాధించాం. రైతులకు వ్యవసాయానికి వ్యక్తిగతంగా, గ్రూపులకూ రుణాలు అందిస్తున్నాం. ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున గ్రూపులోని సభ్యులకు ఇస్తున్నాం. గోదాముల నిర్మాణానికి 4శాతం వడ్డీతో అందజేస్తున్నాం.

బట్టేపాడు, అనంతసాగరంలో...

అనంతసాగరం, బట్టేపాడు సొసైటీల పరిధిలో బంగారంపై రుణాలు అందించేందుకు సిద్ధం చేశాం. ఎన్‌డీసీసీబీల పరిధిలో లాకర్‌ సౌకర్యం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంచాం. డిపాజిట్ల సేకరణకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. 599 రోజుల డిపాజిట్లకు 7 శాతం వడ్డీ చెల్లిస్తున్నాం. వయోవృద్ధులకు7.5 వడ్డీ ఇస్తున్నాం. క్రాప్‌, మార్టిగేజ్‌, గృహ నిర్మాణ రుణాలు విస్తృత స్థాయిలో అందిస్తున్నాం.

మరో 13 శాఖల మంజూరుకు..

ఎన్‌డీసీసీబీ సేవలు విస్తృతం చేస్తున్నాం. ఇప్పటి వరకు 20 శాఖల ద్వారా అందిస్తున్నాం. కొత్తవి మరో 13 మంజూరు చేయాలని అడిగాం. మండలానికి ఒకశాఖ కావాలని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపాం. 15ఏటీఎంలకు ప్రతిపాదనలు పంపాం. సొసైటీలు అన్నింటి పరిధిలో బంగారు రుణాలు ఇచ్చే సేవలు అందుబాటులోకి తేనున్నాం. సొసైటీల్లో మౌలిక వసతుల కల్పనకు ఆప్కాబ్‌ నుంచి రూ. 8లక్షలు రుణంగా ఇస్తున్నాం. ఇప్పటి వరకు రూ. 1.5 కోట్లు అందజేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని