logo

తెదేపాతోనే అన్ని వర్గాలకు సమన్యాయం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణలు, కేక్‌ కటింగ్‌లు, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం తదితర కార్యక్రమాల్లో తెదేపా

Published : 30 Mar 2023 03:46 IST

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణలు, కేక్‌ కటింగ్‌లు, ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం తదితర కార్యక్రమాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ తెదేపా జెండాను ఎగురవేశారు. కేక్‌ కోసి సంబరాలు జరుపుకొన్నారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలను సన్మానించారు. ఈ సందర్భంగా అజీజ్‌ మాట్లాడుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. ఆ మహనీయుడికి భారతరత్న ఇచ్చే వరకు పోరాడుతామన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి రమేష్‌రెడ్డి ప్రసంగిస్తూ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు పని చేయాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ అనూరాధ, విజేతరెడ్డి, జాఫర్‌ షరీఫ్‌, పనబాక భూలక్ష్మి , నరేంద్రరెడ్డి, పెంచలనాయుడు, సాయిబాబా, సాబీర్‌ఖాన్‌, కువ్వారపు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నర్తకీ కూడలి, మినీ బైపాస్‌లోని ఎన్టీఆర్‌ పార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని