logo

ఉపకార వేతనాల దరఖాస్తుల్లో జిల్లా ప్రథమం

ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో బుధవారం నిర్వహించిన

Published : 20 Jan 2022 02:40 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, పక్కన ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో బుధవారం నిర్వహించిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రతి నెల చివరి రోజున జరిగే పౌరహక్కుల దినోత్సవ సమావేశాలకు విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులను ఆహ్వానించాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసులను వర్గీకరించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని ఎస్సీ సంక్షేమాధికారిణి రజిత వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ అన్యోన్య, ఎస్టీ సంక్షేమాధికారి అంబాజీ, బీసీ సంక్షేమాధికారి శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, డీఎస్పీలు సోమనాథం, శశాంక్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, జిల్లాస్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు డాక్టర్‌ మల్లికార్జున్‌, మల్లయ్య, రాజు, గణేశ్‌, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
‘ఎన్నికల ముచ్చట్లు’ పుస్తకావిష్కరణ : ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాకేంద్రానికి చెందిన రాజనీతిశాస్త్ర ఉపన్యాసకుడు వైద్య ఉమాశేషారావు రచించిన ‘ఎన్నికల ముచ్చట్లు’ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంటర్‌ నోడల్‌ అధికారి షేక్‌సలాం, సదాశివనగర్‌ ప్రిన్సిపల్‌ అజ్మల్‌ఖాన్‌, కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ నాయకులు బొర్ర రాజాగౌడ్‌, రజాక్‌, మనోహర్‌, రాజు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని