logo

కాంగ్రెస్‌తోనే సంక్షేమం : జీవన్‌రెడ్డి

: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు.

Published : 26 Apr 2024 05:27 IST

కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, న్యూస్‌టుడే: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో నిర్వహించిన బూత్‌ లెవల్‌ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని.. అధికారంలోకి వచ్చికా వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం పెంచారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, అమలు చేసిన వెంటనే భారాసను రద్దు చేయించాలని హరీశ్‌రావును డిమాండ్‌ చేశారు. పసుపు బోర్డు హామీ ఎటుపోయిందని ఎంపీ అర్వింద్‌ను ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సమావేశంలో ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో కొట్లాడి నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని పలు వార్డుల్లో జీవన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, నాయకులు మోహన్‌రెడ్డి, నర్సింగరావు, కరంచంద్‌, కృష్ణారావు, సుజిత్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని