logo

పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి

గత లోక్‌సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్‌ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు.

Published : 26 Apr 2024 05:27 IST

ప్రసంగిస్తున్న భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, చిత్రంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

ఆర్మూర్‌, న్యూస్‌టుడే: గత లోక్‌సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్‌ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. రైతుద్రోహి భాజపాకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. గురువారం ఆర్మూర్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు హామీల పేరుతో వంచనకు పాల్పడి గెలిచిందని విమర్శించారు. భారాస హయాంలో జిల్లాలో జరిగిన అభివృద్ధే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా గెలిచిన రాకేశ్‌రెడ్డి ఒక్క అనారోగ్య బాధితుడిని ఆదుకోలేదన్నారు. రూపాయికే వైద్యమని మభ్యపెట్టి నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. భారాస కార్యకర్తలను వేధించే అధికారులను విడిచిపెట్టమని హెచ్చరించారు. తమ హయాంలో జరిగిన పనులకు బిల్లులివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌, బోధన్‌ ఇన్‌ఛార్జి అయేషా ఫాతిమా, ఎర్రం ముత్యం, ఎంపీపీలు సంతోష్‌రెడ్డి, మస్త ప్రభాకర్‌, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని