logo

ఉపాధ్యాయుడిపై వేటు.. ఏజెన్సీ రద్దు

రెంజల్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

Published : 08 Dec 2022 06:15 IST

వంటశాలను పరిశీలిస్తున్న అదనపు డీఎంహెచ్‌ఓ విద్య

రెంజల్‌, న్యూస్‌టుడే: రెంజల్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. భోజన నిర్వహణ పర్యవేక్షకుడు గంగాధర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ దుర్గాప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీని రద్దు చేశారు. 24 రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు సమస్య తలెత్తడంపై సెక్టోరియల్‌ అధికారి నర్రారామారావు విచారణ చేపట్టారు. నివేదికను డీఈఓకు అందజేయనున్నట్లు తెలిపారు. అదనపు డీఎంహెచ్‌ఓ బడికి వెళ్లి వంట గదిని పరిశీలించారు. సర్పంచి రమేశ్‌కుమార్‌, ఎంఈఓ గణేశ్‌రావు, కిశోర్‌, వైద్యుడు శివప్రసాద్‌, పర్యవేక్షకులు కరిపె రవీందర్‌, శ్రావణ్‌కుమార్‌, రాంచందర్‌, నాగరాజు తదితరులున్నారు.

ఇప్పటివరకు ఐదుగురు.. : రెంజల్‌ ఉన్నత పాఠశాలలో భోజనం వికటన ఘటనల్లో ఇప్పటివరకు ఎంఈఓతో పాటు మరో నలుగురిపై సస్పెన్షన్‌ వేటు పడింది. రెండు నెలల వ్యవధిలో రెండు ఏజెన్సీలు రద్దయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని