logo

ప్రజలు తమ ఓటుని నిర్భయంగా వినియోగించుకోవాలి

ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు స్వీప్‌ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు.

Updated : 28 Mar 2024 15:58 IST

ఎల్లారెడ్డి పట్టణం: ఓటర్లలో చైతన్యం పెంచేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు స్వీప్‌ (సిస్టమటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డి ఆర్డీవో, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ప్రభాకర్ తెలిపారు. అందులో భాగంగానే తహసీల్దార్ కార్యాలయంలో గురువారం గ్రాఫిటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో  తహసీల్దార్ మహేందర్, రెవెన్యూ సిబ్బంది శ్రీనివాస్, శ్రీకాంత్, ఇమ్రాన్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని